![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -244 లో......గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. అప్పుడే తనకి ఊపిరి ఆడదు. దాంతో పక్కకి వెళ్లి కూర్చొని ఉంటుంది. అప్పుడే రుద్ర ఏదో తీసుకొని వచ్చి ఇస్తాడు. విశ్వ తన స్టూడెంట్ ధీరజ్ తో అక్కడికి వస్తాడు. ఏంటి నీ భార్యకి ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్లు ఉంది.. అలాంటి వాళ్ళతో నువ్వు బాక్సింగ్ పోటీకీ ట్రైన్ చేస్తున్నావా అని విశ్వ అనగానే సంకల్పం ముందు ఏది అడ్డురాదని రుద్ర అంటాడు. అయితే మా ధీరజ్ తో పోటీ పడమని విశ్వ అనగానే వెంటనే గంగ చేతులకి గ్లౌస్ తొడుక్కొని నేను రెడీ అంటుంది.
ఆ తర్వాత ధీరజ్ ని గంగ ఓడిస్తుంది. ఇప్పుడు ఏమంటారు నన్ను తక్కువ చేసి మాట్లాడిన ఒప్పుకుంటాను కానీ మా సర్ ని ఏదైనా అంటే ఒప్పుకోనని గంగ అనేసి వెళ్తుంది. మీ ధీరజ్ కి ఇంకా ట్రైనింగ్ అవసరం అనుకుంటా బాగా ప్రాక్టీస్ చేయించండి అని రుద్ర చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏంటి ఇది ధీరజ్ అని విశ్వ అంటాడు. తను చేసే బాక్సింగ్ అచ్చం మీరు చేసేలాగా ఉంది సర్.. అమ్మాయితో పోటీ ఏంటి అని స్టక్ అయ్యాను సర్ అని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత థాంక్స్ గంగ నా కోసం గెలిచినందుకు అని రుద్ర అంటాడు. మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా అని గంగ అంటుంది. అప్పుడే రంగా వచ్చి ఇంట్లో జరిగింది మొత్తం చెప్తాడు. వెంటనే అందరు సూపర్ మార్కెట్ కి బయల్దేరతారు. కార్తీక్ సూపర్ మార్కెట్ కి లేట్ గా వచ్చినందుకు తనపై శకుంతల కోప్పడుతుంది. ప్రమీలని కార్తీక్ అలా తెల్లచీరలో చూసి షాక్ అవుతాడు. ఏంటి మేడం ఇది అని అడుగుతాడు. మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని ప్రమీల అంటుంది. దాంతో నీకు అవసరం లేని వాటి గురించి ఎందుకు అని కార్తీక్ పై శకుంతల కోప్పడుతుంది. ఆ తర్వాత గంగ, రుద్ర వస్తారు. ప్రమీలని అలా చూసి బాధపడుతాడు రుద్ర. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు కానీ నా నిర్ణయానికి ఎవరైనా అడ్డుచెపితే తను ఇంట్లో ఉండదని శకుంతల అనగానే అది మీ నిర్ణయం పెద్దమ్మ మేమేధో డైట్ కి అవసరమైనవి తీసుకొని వెళ్ళడానికి వచ్చామని రుద్ర అంటాడు. మరొకవైపు విశ్వకి సుధా ఫోన్ చేసి హోమం ఉంది కదా.. రమ్మని అంటుంది. రాను నాకు వీలు కాదని విశ్వ చెప్తాడు.
నేను అవసరమైన సామాను తీసుకొని వస్తానని పంతులుతో సుధా అంటుంది. లేదు మావాడు తీసుకొని వస్తాడని ఇంకొక అతన్ని పంతులు పంపిస్తాడు. ఆ తర్వాత ఏంటి సర్ మీరు ఏం అనట్లేదని గంగ అనగానే ఇప్పుడు పెద్దమ్మని ఏం అన్నా ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుంది.. పెద్దమ్మ చేసింది తప్పు అని తనకి అనిపించేలా ఒక ఛాన్స్ దొరకాలని రుద్ర అంటాడు. అప్పుడే సుధా వాళ్ళ ఇంట్లో హోమానికి కావలసిన సామాను తీసుకొని వెళ్ళడానికి పంతులు సూపర్ మార్కెట్ కి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |